జపనీస్ శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తాం
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి: జపాన్ దేశంలో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ విద్యార్థులకు ఆరు నెలల పాటు జపనీస్ భాషలో శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కంమేనేజర్ నాగ భారతి అన్నారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులకు శనివారం స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ముందుగా టాంకాం కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. జపాన్ లో పనిచేసేవారు మాట్లాడే విధానం తదితర అంశాలపై టాంకాం డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్ మాధవ రెడ్డి క్లుప్తంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగ భారతి మాట్లాడుతూ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కం కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా స్పెసిఫైడ్స్ కిల్డ్ వర్కర్స్ క్రింద జపాన్ లో పనిచేసేందుకు అర్హత కలిగిన కలినవారిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. 97 మందికి అభ్యర్థులకు అవగాహన కల్పించారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఫోన్ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాష పై ఆరు నెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ జపాన్ లో పనిచేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్పిస్తామని పేర్కొన్నారు ఎంపికైన వారికి పూర్తిస్థాయి భద్రత టాంకాం ఇస్తుందని భరోసానిచ్చారు జపాన్ లో ప్రతినెల రూపాయలు 1,20 నుండి 1,50,000 వరకు సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి ఎస్ మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 29 ,30 తేదీలలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సూర్యాపేట నందున స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కావచ్చు అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చెన్నయ్య, జూనియర్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.