సైదులు … వ్యవసాయం ఎట్లుంది!!!
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి
శుభకార్యాలకు వెళుతూ రైతులతో మంత్రి జగదీష్ రెడ్డి
పత్తి బాగా దిగుబడి వచ్చిందా…?
పత్తి పంట తరువాత ఎందుకు? భూమి ఖాళీ గా ఉంచినవ్?
రెండవ పంటగా ఆకుకూరలు, కాయగూరలు వేస్తే బాగుండు అని సూచించిన మంత్రి
అనాజీపురం- అనంతారం రోడ్డు పక్కన రైతులతో మాట్లాడిన మంత్రి
రైతులతో మంత్రి మాటామంతీ
పెన్ పహాడ్,అక్షిత ప్రతినిధి: వానా కాలం సాగు చేసిన పత్తి, వరి పంటల తరువాత యాసంగిలో ఆకుకూరలు, కూరగాయల వంటి డిమాండ్ ఉన్న ఇతర పంటల సాగుచేసుకోవాలని రైతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. పంట మార్పిడి సాగువల్ల భూమిలో సారం కూడా పెరుగుతుందని తెలిపారు. శనివారం సూర్యాపేట నియోజకవర్గం లోని పలు శుభకార్యాలకు హాజరైన మంత్రి పెన్ పహాడ్ మండలం అనాజి పురం – అనంతారం మధ్య కారు దిగి రైతులతో మాట్లాడారు.
రైతులతో కాసేపు ముచ్చటించారు. వానాకాలం ఏ పంట ను సాగు చేశారు…వానా కాలం పంట గా వేసిన పత్తి దిగుబడి ఎంత వచ్చింది? మారెట్‌లో ధర ఎంత ఉన్నది? పంట చేతికొచ్చేవరకు ఎన్ని తడులు నీళ్లు పెట్టినరు? తదితర అంశాలను అడిగి తెలుసు కున్న మంత్రి ప్రస్తుతం చాలా మంది రైతులు పత్తి సాగు తరువాత తమ భూములను ఖాళీగా ఉంచడం పట్ల అలా ఎందుకు ?ఉంచారు అని అడిగారు.నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండటంతో దిగుబడి పెరిగిందని రైతులు పొన్నబోయిన సైదులు, నూకల జానయ్య లు మంత్రి కి వివరించారు. భూముల పక్కనే కాలువల ద్వారా కాళేశ్వరం నీరు వెళుతున్నా ఖాళీగా ఉంచడం బాగోలేదని అన్నారు.. రెండవ పంట గా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తే, రైతు లతో పాటు మరో ముగ్గురు వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుందని మంత్రి అన్నారు.. ఒకరిద్దరు రైతులు మొడలు పెడితే క్రమ క్రమంగా మిమ్ములను చూసి అందరూ రైతులు మీ దారిలో నడుస్తారనీ మంత్రి అన్నారు. సూర్యాపేట వంటి పట్టణాలు గ్రామాలకు దగ్గర గా ఉండటం తో
మారెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును రైతులు చేపట్టాలన్నారు. మంత్రి వెంట పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, సూర్యాపేట జడ్పీటిసి జీడి బిక్షం, అనాజిపురం సర్పంచ్ చెన్ను శ్రీనివాస్ రెడ్డి, పెన్ పహాడ్ యూత్ మండల అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.