అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నకిరేకల్ అక్షిత ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామానికి చెందిన చల్ల యాదయ్య తండ్రి ఎర్రయ్య తనకున్న రెండు ఎకరాల పొలం తో పాటు మరో రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని. వ్యవసాయo చేస్తున్నాడు. గత సంవత్సరం పెట్టిన పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కురుకుపోయాడు.ఈసారైనా పంట బాగా పండితే తెచ్చిన అప్పులు తీరుతాయని ఆశపడ్డ రైతు కు వరి చేనుకు మొత్తం తెగులు వచ్చి చనిపోవడం తో.తెచ్చిన అప్పులు తీర్చలేక పొలానికి కొట్టడానికి తెచ్చిన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతువేదికలను నిర్మించి ఏ పంటలు పండించాలి చెనుకు తెగులు వస్తే ఏ మందులు వాడాలి అని చెప్పిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి కారణం ఎవరు అధికారుల నిర్లక్ష్యం వల్లన చెనుకు కొట్టడానికి తెచ్చిన మందులు పనిచేయకపోవడం వలన ఈప్పటికయినా వ్యవసాయ అధికారులు స్పందించి కల్తీమందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.