ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక అక్షిత ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక లక్ష్యం ఉండాలని అన్నారు.

లక్ష్యంతోనే పనిచేస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యార్థులకు సూచించారు. సాంకేతిక నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలని సూచించారు. కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మౌలిక వసతుల కల్పన కు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ఎప్పుడైనా తనని సంప్రదించవచ్చని విద్యార్థుల సౌకర్యాలకు అవసరమైన అనేక ఏర్పాట్ల కోసం తను ఎప్పుడు అందుబాటులో ఉంటానాని అన్నారు.