రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం

మంచిర్యాల, అక్షిత బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉంటే రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించింది కేవలం రెండు శాతం మాత్రమేనని, రాష్ట్ర బడ్జెట్ ప్రారంభం ముందే బడ్జెట్లో బీసీలకు 20వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ బీసీల ఆకాంక్షను పరిగణలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా బీసీలను వివక్షకు గురి చేయడమే అవుతుందని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక పన్నులు కడుతుంది బీసీలే అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులో అన్యాయం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ బడ్జెట్లో బీసీలకు కేటాయించింది 6229 కోట్లు మాత్రమేనని, రాష్ట్రంలోని బీసీలకు ఈ బడ్జెట్ తో బిస్కెట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈ బడ్జెట్ పై పున సమీక్షించి బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాల ఐక్యవేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది రాజలింగు మోతె, ఐక్యవేదిక నాయకులు బలిశెట్టి లక్ష్మణ్, నీలం బాలాజీ తదితరులు

Leave A Reply

Your email address will not be published.

Breaking