రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడితో, కాకి లెక్కలతో కూడుకున్నది ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ మాత్రమే ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడితో, కాకి లెక్కలతో కూడుకున్నది
ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ మాత్రమే
ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ
మంచిర్యాల, అక్షిత బ్యూరో:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడితో, కాకి లెక్కలతో కూడుకున్నది, ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ మాత్రమేనని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని మరొకసారి మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప ఇది నిజమైన ప్రజా బడ్జెట్ కాదని అన్నారు. ప్రజలకు ఏ విధంగా మేలు చేసేది కాదని, సంఘటిత, అసంఘటిత, కార్మికులకు, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి లాభం లేదని, ఇది కేవలం మోసపూరితమైన బడ్జెట్ అని, ప్రజల బతుకుల్లో మార్పు తీసుకువచ్చే బడ్జెట్ కాదని, అధిక ధరలతో, నిరుద్యోగ సమస్యతో తల్లడిల్లుతున్న ప్రజానికానికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ బడ్జెట్ రూపొందించారని తెలిపారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయడానికి గాని, విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు గిట్టుబాటు ధరలు, మూడు ఎకరాల భూమి, సాగునీరు, తాగునీరు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఈ బడ్జెట్లో ఎలాంటి అవకాశాలు లేవని అన్నారు.