గ్రామాభివృద్ధి ని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాను – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి – కాట శ్రీనివాస్ గౌడ్

గ్రామాభివృద్ధి ని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాను – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి – కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, అక్షిత ప్రతినిధి :పటాన్ చెరు మండలం భానూరు గ్రామంలో తమ పంచాయతీ గ్రామస్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు గ్రామ అభివృద్ధికై నిర్మిస్తున్న షట్టర్ లను ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అధికార బలంతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సర్పంచ్ గా ఉన్నాడని షట్టర్ లు నిర్మిస్తే తనకు, తమ పార్టీకు ఎటువంటి లాభం చేకూర దేమో అన్న ఒకే ఒక్క దురుద్దేశంతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని మీ దౌర్జన్య పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. గ్రామస్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking