జ‌ర్న‌లిస్టుల‌కు తాను అండ‌గా ఉంటా

జ‌ర్న‌లిస్టుల‌కు తాను
అండ‌గా ఉంటా

త్వ‌ర‌లోనే శుభ వార్త వింటారు

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

మంత్రిని క‌లిసిన టియూడ‌బ్ల్యుజే మేడ్చ‌ల్ జిల్లా ప్ర‌తినిధులు

 

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలోని జ‌ర్న‌లిస్టుల‌కు తాను ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం మేడ్చ‌ల్ జిల్లా క‌మిటీ స‌భ్యులు బుధ‌వారం ఆమె నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈసంద‌ర్భంగా మేడ్చ‌ల్ జిల్లా జ‌ర్నలిస్టుల స‌మ‌స్య‌ల‌ను ఆమె దృష్టికి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాలరాజు తీసుకెళ్ళారు. పూర్వం ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన ఇళ్ళ ప‌ట్టాల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ, ఇళ్ల స్థ‌లాలు రానటు వంటి విలేక‌రుల‌కు త‌గిన న్యాయం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమెను కోరారు. గ‌తంలో రాజేంద్ర‌న‌గ‌ర్ మండలంలోని గందంగూడ‌, ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం కాచ‌వాని సింగారం, అన్నోజిగూడ‌ల‌లో మీ హాయంలో ప‌ట్టాలు ఇచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు పోజిష‌న్ పోలేక‌పోతున్నామ‌ని, వీటిని వెంట‌నే ప‌రిష్క‌రించాలని బాల‌రాజు కోరారు. వీటి విష‌యంలో ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ ను క‌లిసిన స‌బితా మేడ‌మ్ నోటీసులో ఉంద‌ని చెప్ప‌డం జ‌రిగింద‌ని ఆమె దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలు పొంద‌న‌టు వంటి విలేక‌రుల‌కు ఇళ్ల స్థ‌లాల విష‌యంలో త‌గిన న్యాయం చేసేందుకు చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విలేక‌రుల ఇళ్ల స్థ‌లాల ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టి సారించింద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే అందరికి త‌గిన న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.2007-2009లో ఇచ్చిన ప‌ట్టాల స‌మ‌స్య ప‌రిష్కారానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో కూడా చ‌ర్చించామ‌ని వివ‌రించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌ల నుంచి ప్ర‌భుత్వం పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే శుభ‌వార్త వింటార‌ని ఆమె భ‌రోస నిచ్చారు. కార్య‌క్ర‌మంలో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వెంక‌ట్‌రామిరెడ్డి, జిల్లా ఉపాధ్య‌క్షులు గోవింద్‌, మోహ‌న్, సహాయ కార్య‌దర్శులు అక్బ‌ర్‌, రాములు, కూక‌ట్‌ప‌ల్లి ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు క‌రీం, ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడు సురేష్‌, ఉప్ప‌ల్‌ ప్రెస్ క్ల‌బ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రోత్తంరెడ్డి, జిల్లా నాయ‌కులు ప్ర‌భాక‌ర్‌, న‌వీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking