
*దళితబంధు పథకం
లబ్ధిదారులకు అవగాహన*
అక్షిత ప్రతినిధి, వేములపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని వేములపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, పంచాయితీ కార్యదర్శి గజగంటి శ్రవణ్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దళితబంధు పథకం కింద ఎంపిక చేసిన 26 మంది లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా దళితబంధు పథకం అమలు లక్ష్యాలు, లబ్ధిదారులు పాటించవలసిన నియమనిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. దేశంలో మరెక్కడ లేని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ అమిరెడ్డి పద్మ శేఖర్ రెడ్డి, వార్దు సభ్యులు ఉగ్గే మునీశ్వర్ రావు, పుట్టల సందీప్ బిల్ కలెక్టర్ నరేందర్, శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.