ఐడిఓసిలో జిల్లా కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

ఐడిఓసిలో జిల్లా కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఐడిఓసిలోని జిల్లా కార్యాలయాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డ్రగ్స్ కంట్రోల్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాలను తనిఖీ చేసి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో సిబ్బంది ఎక్కడికి వెళ్ళింది అడిగారు. సిబ్బంది కార్యాలయ పనివేళలు పాటించాలని, విధుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనానికి కొందరు బయటకు వెళుతున్నట్లు గమనించి కార్యాలయాల సముదాయంలో అన్ని వసతులు ఉన్నట్లు మధ్యాహ్న భోజనం తెచ్చుకోవాలని బయటకు వెళ్లడం చేయకూడదని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking