
“దళితబంధుతో ఆర్థిక పరిపుష్టి
దళితుల జీవితాల్లో వెలుగులు
దేశానికి తలమానికం… దళిత బంధు
ఎంపి బడుగుల, ఎంఎల్
ఏ నలమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
దళితుల ఆర్థిక పరిపుష్టికి దళిత బంధు ఉపయుక్తంగా ఉంటుందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు లు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పీ క్యాంపు ఆవరణలో దళిత బంధు పథకం కింద మంజూరైన ఆస్తులను పంపిణి చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 75 మంది లబ్దిదారులకు 10 లక్షల చొప్పున 7 కోట్ల 50 లక్షల రూపాయల ఆస్తులను ట్రాక్టర్, జేసిబి, 4 వీలర్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళితుల ఉజ్వల భవిష్యత్తుకు దళిత బంధు ఉద్దీపనగా నిలువనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులు ఆయా యూనిట్లను సక్సెస్ గా నడిపించడంతో ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చన్నారు. దళితులను ఆర్థికంగా పటిష్ఠవంతం చేసేందుకు సీఎం కేసిఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలన్నారు.

విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్ట్‌లలో సైతం దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. లబ్దిదారుల ఇష్టం వచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకుని వ్యాపార రంగంలో రాణించినప్పుడే సక్సెస్ మీ సొంతం అవుతుందని, మీ సక్సెస్ తోనే ఇతరులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజి లేకుండా రుణ బాధలకు తావివ్వకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఆయా లబ్దిదారులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కు కోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్, ఎస్.సి కార్పొరేషన్ నల్లగొండ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, ఏఓ రాజు,సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం, దేవేందర్ రావు, జూనియర్ అసిస్టెంట్ నరేందర్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు భార్గవ్, డిసిఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటిరెడ్డి, ఎం.పీ.పీలు నూకల సరళ హనుమంత్ రెడ్డి, ధనవత్ బాలాజీ నాయక్, పోకల శ్రీవిద్య రాజు, ధీరావత్ నందిని రవితేజ, పుట్టల సునీత కృపయ్య, జడ్పీటీసీ లలిత-హతిరం, సేవ్య నాయక్, ఇరుగు మంగమ్మవెంకటయ్య, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మైనారిటీ నాయకులు యూసుఫ్, అన్నభీమోజు నాగార్జున చారి, మండల పార్టీ అద్యక్షులు కురాకుల చిన రామయ్య, మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, చిర్ర మల్లయ్య యాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మిర్యాల మధుసూదన్, పాక్స్ చైర్మన్లు, వైస్ ఎంపిపిలు, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎం.పి.టి.సి లు, వార్డ్ మెంబర్లు, గ్రామపార్టీ అద్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు.