భూగర్భ జలాలను భావితరాలకు అందించాలి

భూగర్భ జలాలను

భావితరాలకు అందించాలి 

చంద్రారెడ్డి

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో అక్రమంగా కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లను వెంటనే తొలగించాలని బస్తి అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి తెలిపారు.

వాటర్ ప్లాంట్ల ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ వీరంజనేయ శివాలయం ఆవరణలో ని కమిటీ హాల్లో బస్తి వాసుల సంక్షేమం లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార దృక్పధంతో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లను తొలగించి ఆలయ ప్రాంగణంలో స్వచ్చందంగా కొనడగుతున్న వాటర్ ప్లాంట్ ను కొనసాగించాలని తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో బస్తి ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, కోశాధికారి నర్సింహులు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking