
అభివృద్ధి సంక్షేమమే
బిఆర్ఎస్ ఏజెండా
నేడు శెట్టిపాలెంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి
అక్షిత ప్రతినిధి, వేములపల్లి :
తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ ఏజెండా అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం నందిపాడు బైపాస్ రోడ్డులోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఆత్మీయ సమావేశంలో మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, గ్రామ కోఆర్డినేటర్లు, వార్డు సభ్యులు, పిఎసిఎస్ డైరెక్టర్లు, ఉపసర్పంచులు పార్టీ జిల్లా, మండల నాయకులు బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మండల గ్రామ శాఖల అనుబంధ సంఘ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అందుకే రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ కు అండగా నిలుస్తున్నారన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో పార్టీలకు కతీతంగా గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని మేజర్ల కింద బీడు భూములకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఐదు లిఫ్టుల నిర్మాణానికి 1000 కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. లిప్టుల ఏర్పాటుతో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్, ఇరుగు వెంకటయ్య, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, కాట్రగడ్డ రాజగోపాల్ రావు, గౌరు శ్రీనివాస్, చల్లబట్ల వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, తంగెళ్ల సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.