దళిత జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుండే సంపత్

దళిత జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుండే సంపత్

మద్దూరు, అక్షిత న్యూస్ :

హైదరాబాద్ దళిత జన సమితి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కమిటీల నియామకాలలో భాగంగా మండలంలోని బెక్కల్ గ్రామానికీ చెందిన గుండే సంపత్ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మరియు నాచారం డివిజన్ ఇన్చార్జిగా చేర్యాల బాలయ్యను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న టి యస్ పి సి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో అక్రమాల గురించి రాష్ట్ర గవర్నమెంట్ ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిపై సెట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి, ఎటువంటి అన్యాయాలకు, అక్రమాలకు తావు లేకుండా, కమిషన్ ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నమెంట్ ను డిమాండ్ చేయడం జరిగింది. ఎన్నో ఆశలతో పేద విద్యార్థి, కొన్ని నెలల కష్టాన్ని,ఇలా చేయడం బాధాకరం, కమిషన్ చైర్మన్ జనార్ధన్రెడ్డి పై క్రిమినల్ కేసును నమోదు చేయాలన్నారు, ఇందులోపాల్గొన్న వారు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి, నాచారం డివిజన్ ఇంచార్జి, చేర్యాల్ బాలయ్య , ముస్లిం మైనార్టీ, ఇంచార్జ్ సయ్యద్ మాజీద్,స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు బొజ్జ రాకేష్ ,దళిత జన కార్మిక విభాగం అధ్యక్షుడు బొజ్జ రమేష్ గారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking