కన్నుల పండువగా రాములోరి కల్యాణం

కన్నుల పండువగా
రాములోరి కల్యాణం

* సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలకు పునర్ వైభవం

* కల్యాణాన్ని తిలకించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కల్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలకు పునర్ వైభవం వచ్చిందన్నారు. లోకకల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామ మందిరాలను విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో భాస్కర్ రావు పాల్గొని స్వామివారి తీర్థ,ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భాస్కర్ రావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking