ఆశీర్వాద్ గోధుమ పిండి పొట్లాల పంపిణి
* ఐటీసీ డీలర్ మద్ది వెంకటేశ్వర్లు తనయుడు శ్రీధర్ వితరణ అభినందనీయం
హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పవిత్ర రంజాన్ మాసంలో మరో 50 కుటుంబాలకు ఆశీర్వాద్ గోధుమ పిండి పొట్లాలను పంపిణీ చేసిన ప్రఖ్యాత ఐటీసీ డీలర్ మద్ది వెంకటేశ్వర్లు తనయుడు శ్రీధర్ వితరణ అభినందనీయమని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కొనియాడారు.

గతనెల 26న శ్రీధర్ సహకారంతో మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 30 మందికి సహకారం లభించిందన్నారు. తాజాగా, విద్యానగర్,ఇందిరమ్మ కాలనీల్లో నిర్వహించిన ఆశీర్వాద్ గోధుమ పిండి పొట్లాల పంపిణీ కార్యక్రమాల్లో హమీద్ షేక్ మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు చేయూత అందించేందుకు ముందుకొస్తున్న దాతలకు ధన్యవాదములు తెలిపారు. శ్రీధర్ సేవలు స్ఫూర్తి దాయకమని హమీద్ షేక్ తెలిపారు.
Comments are closed.