సమాజ మార్పుకు కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
మహాత్మా ఫూలే సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా సమాజ మార్పుకు కోసం కృషి చేసిన మహనీయుడని కక్కిరేణి గ్రామ సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి అన్నారు.
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా వారు పాల్గొని పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది..ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్ , సామాజిక కార్యకర్త వేముల సైదులు వార్డు సభ్యురాలు చెరుకు గోపమ్మ , నల్ల ప్రసాద్ , కట్ట ప్రహ్లాద , అంకిరెడ్డి కళ్యాణ్ , ముత్తమ్మ , సాలయ్య , గ్రామపంచాయతీ సిబ్బంది రమేష్ ,బిక్షం , యశోద, రవి తదితరులు పాల్గొన్నారు