భారత దేశ మొట్ట మొదటి సామాజిక సేవ తత్పరుడు మహాత్మా జ్యోతి బా పులే కార్పొరేటర్ కవితా

భారత దేశ మొట్ట మొదటి సామాజిక సేవ తత్పరుడు మహాత్మా జ్యోతి బా పులే కార్పొరేటర్ కవితా యాదవ్ వరంగల్,అక్షిత బ్యూరో : అట్టడుగు వర్గాల అభివృద్ధికి పేదల విద్యా వ్యాప్తికి దళిత వర్గాల విద్యా చైతన్యానికి కృషి చేసిన మహానీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా దేశ పేట గ్రంధాలయం ఆవరణంలో వారి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిత మాట్లాడుతూ పేదలు అట్టడుగు వర్గాల విద్యా చైతన్యానికి సామాజిక అభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదటి భారత సామాజిక సేవకులు మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు వారు చూపించి ఆచరించిన మార్గాలు నేటి యువతకు రాబోయే తరాలకు ఆదర్శనీయమని వాటిని ఆచరించడం మనందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అక్కినపల్లి యాదగిరి స్వర్ణ భారతి అధ్యక్షురాలు పాలడుగుల నిర్మల, డాక్టర్ పాలడుగుల సురేందర్ సేవా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అయిత ఉష భాస్కర్ చిందం భాస్కర్ విప్పా సుధాకర్ ప్రసంగి భాష తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking