ఫూలే స్ఫూర్తితో యువత ఉద్యమించాలి  డా. పాల్వాయి హరీష్ బాబు పిలుపు

ఫూలే స్ఫూర్తితో యువత ఉద్యమించాలి  డా. పాల్వాయి హరీష్ బాబు పిలుపు

 

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

 

ఈ రోజు ఉదయం కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన ఫూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని మహత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులర్పించిన భాజపా నాయకులు.

 

ఈ సందర్భంగా

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే గొప్ప సంఘసంస్కర్త అని, సామాజిక సమన్యాయం కోసం పాటుపడిన ధీశాలి అని, మహిళల విద్యాభివృద్ధి కోసం ఫూలే దంపతులు చేసిన కృషి అమోఘని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్పూర్తితో కేసీఆర్ ప్రభుత్వ దురాగతాలను మరియు అణచివేత ధోరణలకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తు అశోక్, జిల్లా నాయకులు పిర్సింగుల తిరుపతి మండల ప్రధాన కార్యదర్శులు జాడి దీపక్, డోంగ్రి కార్తిక్, సంతోష్ ఠాకూర్, వలుపదాసు రమేష్, చిప్పకుర్తి శ్రీనివాస్, కుమార్ గౌడ్, నికోడే అర్జున్, రాజేందర్ జాంజోడ్, అనిల్ కుమార్, అర్ణగొండ ప్రశాంత్, బాబురావు, కొండ తిరుపతి, రావుల నరేష్, బొమ్మెల శ్రీనివాస్, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking