సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో రామన్నపేట సుభాష్ సెంటర్ లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది
ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవకమిటి కన్వీనర్ వైస్ యంపిపి నాగటి ఉపేందర్,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావు పూలే అని భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాడిన దార్శనీయుడని,సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని విద్యావంతులు కావాలని స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి సభ్యులు కక్కిరేని విజయ్, ఏటెల్లి శ్రీనివాస్,మేడి సంతోష్, కందుల హనుమంతు,నాగటి యాదయ్య,నకిరేకంటి నర్సింహ,నోముల చిరంజీవి,రాపోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు