ఉద్యమ సామాజిక తత్వ వేత్త మహాత్మ జ్యోతి రావు పూలే
ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్
మద్దూరు అక్షిత న్యూస్:
మద్దూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఎం పి డి ఓ శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికతత్వవేత్త ఉద్యమకారుడు సంఘసేవకుడైన జ్యోతీరావు గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించారని ఆయన భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని తెలిపారు.పులే సమా సమాజ నిర్మాణం కోసం బావి తరాలకు స్పూర్తిగా నిలిచాడన్నారు. వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని సమాజానికి ఆయన చేసిన సేవలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పే కనకమ్మ నాగయ్య, పి అర్ ఏ ఈ వినయ్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఈ సి పర్షరాములు,టి ఎ లు వెంకటమ్మ,,మాధవి,టైపిస్ట్ కేశవరెడ్డి,అజం,రాజు,అనిల్, రాణీ, తెరాస నేత బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.