కొత్త కొత్తూరులో బీసీ జేఎసి ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో బీసీ జేఎసి ఆధ్వర్యంలో సమ సమాజ స్వప్నికుడు మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా బీసీ జేఎసి నియోజకవర్గ కన్వీనర్ పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు సామజిక తత్వవేత్వ చేసిన కృషి అభినందనీయమన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయం ప్రతి ఒక్కరికి విధ్య అందించాలన్నారు.మే మొదటి వారం లో పాలేరు నియోజకవర్గం లోని నాలుగు మండలాల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కొత్త కొత్తూరు గ్రామ సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ బీసి సంఘం పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు అన్నవరపు రాములు సిపిఎం మండల కార్యదర్శి కెవి రెడ్డి బీఆర్ యస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వెన్నపూసల సీతారాములు బీజేపీ మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు సయ్యద్ మోహినుద్దీన్ బీసీ సంఘం నాయకులు తోగటి నాగచారి రామవరపు నాగరాజు బీజేపీ బూత్ అధ్యక్షులు పొనుగోటి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.