బడుగు వర్గాల ఆశాజ్యోతి ఫూలే
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జోతిబా ఫూలే అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మ గౌరవం, సమ సమాజ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని అభివర్ణించారు. మంగళవారం జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు కృషి, సమ సమాజ పునర్నిర్మాణం కోసం మొట్టమొదట పునాదులు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అన్నారు. ఫూలే జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. దేశంలో సబ్బండ కులాల సామాజిక మార్పు కోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు లింగ వివక్షతను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు.

ఫూలే ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల విద్యా ప్రమాణాలను పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, ఎంపీపీ బాలాజీ నాయక్, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, అడవిదేవులపల్లి జడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్, కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, పాక్స్ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, జెర్రిపోతుల రాములు గౌడ్, పాదూరి సంజీవ్ రెడ్డి, సర్పంచులు బిక్షమ్ గౌడ్, బారెడ్డి అశోక్ రెడ్డి, శంకర్ నాయక్, ప్రకాష్ నాయక్, భీమా నాయక్, బాల సత్యనారాయణ, చెరుకుపల్లి సుమన్, చిమట యాదగిరి, మొండికత్తి లింగయ్య, చిన్య నాయక్, కొత్తా ఆంజనేయులు, అహ్మద్, ఫయాజ్, గాదగొని మహేష్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, తదితరులు పాల్గొన్నారు.