రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టివేత

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టివేత

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి 

హస్తినాపురంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన డిఫెన్స్ మద్యాన్ని భారీ ఎత్తున ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ మద్యం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. హస్తినాపురంలోని శ్రీరమణ ఫేస్‌ టు కాలనీలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి డి. సురేశ్ బాబు నివసిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అతడు భారీ ఎత్తున డిఫెన్స్ మద్యం తీసుకువచ్చి.. నగరంలోని బడా బాబులకు విక్రయిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది.ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున డి.సురేశ్ బాబు నివాసంపై వారు దాడి చేసి.. తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 361 డిఫెన్స్ మద్యం బాటిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. బెంగళూరు, హర్యానాలోని డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి మద్యం బాటిళ్లు సురేశ్ రెడ్డి దిగుమతి చేసుకుంటున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. దీంతో డి.సురేశ్ బాబు నివాసంపై దాడి చేశామన్నారు. వీరి రాకను గమనించిన సురేశ్ రెడ్డి.. ఇంటి నుంచి పరారయ్యాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking