బాధిత కుటుంబాలకు రూ. 50లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి -సంఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి -చీమల పాడు ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ పొంగులేటి
బాధిత కుటుంబాలకు రూ. 50లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
-సంఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి
-చీమల పాడు ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన పట్ల ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. అన్ని రకాలుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.