స్పష్టమైన ఫోటో ఓటరు జాబితా రూపొందించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

స్పష్టమైన ఫోటో ఓటరు జాబితా రూపొందించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

స్పష్టమైన ఫోటో ఓటరు జాబితా రూపొందించేందుకు కార్యచరణ తయారు చేసి పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్. డి. ఓ. లతో ఫోటో ఓటరు జాబితా రూపొందించడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు లేకుండా స్పష్టమైన ఫోటో ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాబితా నుండి ఓటర్ వివరాలను తొలగించేందుకు ఫారం 7 ద్వారా దరఖాస్తును పూర్తి చేసి క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులతో పరిశీలన జరిపి వివరాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, డూప్లికేట్ ఓటరు కార్డు కలిగిన వారికి నోటీసులు జారీ చేసి తొలగింపు చర్యలు చేపట్టాలని, 2 లేదా ఎక్కువ ప్రదేశాలలో నమోదు ఉన్న ఓటరు వివరాలను ఒకే దగ్గర ఉంచి మిగతా చోట్ల తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరణించినా, చిరునామా మారిన వారి వివరాలను విచారించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు, సవరణ కొరకు ఫారం 6, 7, 8 పా రముల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారుల సమన్వయంతో విచారణ జరిపి ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయారీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవురావు, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్. డి. ఓ. రాజేశ్వర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు, సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసిల్దార్లు, ఉపతహసిల్దార్లు, సంబంధిత అధికారులతో దరఖాస్తులను పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా తయారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking