దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులకు గ్రూప్ -4 ఉద్యోగ నియామకాల కొరకు సెంటర్ కు (100 ) మందికి ఉచిత శిక్షణ కొరకు యువతీ, యువకుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి గోశిక బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు
అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.లు 2 లక్షల లోపు ఉండాలని, నల్లగొండ పట్టణంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
కావున ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థినీ విద్యార్థులు తమ దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం కలెక్టరేట్ కాంప్లెక్స్, నల్లగొండ నందు ఈ నెల 27 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని,
మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం ఫోన్ నెంబర్ 9494345471, 79811 96060 నందు సంప్రదించగలరని తెలిపారు.
ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ ప్రకటన లో పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking