నెల రోజులుగా విధ్యుత్ సరఫరా లేక అంత్యక్రియలకు ఇబ్బందులు
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్ నగర్ పట్టణంలోని సాయి చరణ్ మోక్షదాంలో గత నెల రోజులుగా విద్యుత్ సరఫరా లేక అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం అంత్యక్రియలకు వచ్చిన వారికి విధ్యుత్ సరఫరాలేక ఇలా వాహనాల లైట్లు వెలిగించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అధికారులు పట్టించుకుని కాస్త విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని ప్రజలు కోరుతున్నారు.