ఇఫ్తార్ విందులో పాల్గొన్న
మొద్దు లచ్చిరెడ్డి
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ సాహెబ్ నగర్ ZAMA – MASJID కు సంబంధించిన సభ్యులు ఆమేద్ అలీ
ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ కల్యాణ మండపం లో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు ముస్లింకు సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారని.రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. మరియు ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో మసీద్ సభ్యులు మహమ్మద్ జావేద్, మొహమ్మద్ మోసిన్, పాషా, అజీజ్, కరీమ్ , మూవీస్ మరియు తదితరులు పాల్గొన్నారు.