రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక – పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం. ఇఫ్తార్ విందులు ఐక్యతకు నిదర్శనం.

రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక – పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం.
ఇఫ్తార్ విందులు ఐక్యతకు నిదర్శనం.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కూకట్ పల్లి నియోజకవర్గం ఎన్ కేఎన్ఆర్ గార్డెన్స్ లో పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో మొహమ్మద్ మొయిజ్ పర్యవేక్షణలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, మైనార్టీ రాష్ట్రనాయకులు ఫహీమ్ ఖురేషి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, నిజాముద్దీన్, పీసీసీ సభ్యులు గొట్టిముక్కల వెంగళ్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరుల అందరికి ఇఫ్తార్ ముబారక్ తెలియచేస్తూ, ఇఫ్తార్ విందుతో ఐక్యమత్యం పెంపొందుతుందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు బూనిన వారికీ సకల శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఐక్యమత్యానికి, మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. ఎవరి మతాలను వారు ఆచరిస్తూనే పరమత సహనం కలిగి ఉండాలని, అప్పుడే సోదరభావాలు పెరుగుతాయన్నారు. ఒకరి మతాలకు సంబంధించిన పర్వదినాలు వస్తే మరో మతానికి చెందిన వారు సహకరించడం మంచి సంస్కృతి అన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, గోపిశెట్టి రాఘవేందర్, మధు గౌడ్, మిస్బా, సమీ, సామ్యూల్, నల్లోల రాజేందర్, తూము వేణు,కృష్ణ రాజ్ పుత్, నర్సింహా యాదవ్, అస్లాం, చిన్న మొయిజ్, వాజీద్, జుబేర్, బషీర్, చున్ను పాషా, అక్రమ్, నయీమ్, ఖాసీం, అహమ్మద్, విఠల్ రెడ్డి, యాదగిరి, మధు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking