పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పట్టుకున్న పట్టణ పోలీసులు కేసును చాకచక్యంగా చేదించిన సీఐ ఆంజనేయులును అభినందించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పట్టుకున్న పట్టణ పోలీసులు
కేసును చాకచక్యంగా చేదించిన సీఐ ఆంజనేయులును అభినందించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
ఈరోజు 18.04.2023 మద్యాన్నం కోదాడ పట్టణం లోని రంగా థియేటర్ సెంటర్ వద్ద పట్టణ CI P.ఆంజనేయులు ఆద్వర్యంలో సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇంతలో సూర్యాపేట్ వైపు నుండి బస్ స్టాండ్ వైపుకి ఒక నెంబర్ లేని స్కూటీ పై ముగ్గురు మైనర్ బాలురు వేగంగా వెళుతుండగా వారిని ఆపటానికి ప్రయత్నించగా ఆపకుండా వెళుతుండగా వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద కొన్నిబంగారు ఆభరణాలు దొరికినవి. వారిని నిలదీయగా తాము ముగ్గురూ కలసి కోదాడ పట్టణంలోని భవానీ నగర్ నందు తేదీ: 13.04.2023 రోజు ఒక ఇంట్లో పగటి సమయంలో చేసిన దొంగతనం తాలూకూ ఆభరణాలు ఇవి అని ఒప్పుకున్నారు, అదే విధంగా తాము భవానీనగర్ లో దొంగతనం తో పాటు గత (15) రోజులుగా కోదాడ టౌన్ లోని నయానగర్, గణేష్ నగర్, అనంతగిరి రోడ్ లలో తాము పట్టపగలు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తూ సుమారుగా 22 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసినాము అని ఒప్పుకున్నారు,

అంతేకాక దొంగతనం చేసిన ఇట్టి బంగారం ను ఒక మైనర్ బాలుడి తల్లి అయిన A-1 షేక్ మీరా W/o బబ్లూ @ బాబు కి, ఆమెతో కలసి సహజీవనం చేస్తున్న A-2: కనతాల శ్రీనివాస్ S/o రవి లకు ఇస్తున్నట్లుగా అంగీకరించినారు. ఈ ముగ్గురితో పాటు వీరికి అండదండలు గా ఉన్న షేక్ మీరా, కనతాల శ్రీనివాస్ లను మొత్తం (5) మంది నిందితులను అదుపు లోకి తీసుకుని పంచుల సమక్షంలో ఒప్పుకోలు , స్వాదీన పంచనామా ను నిర్వహించి వీరి వద్ద నుండి సుమారు 22 తులాల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి, రూ. 20,000/- నగదు, ఒక మొబైల్ ఫోన్ లతో పాటు దొంగతనాలకు వాడిన నెంబర్ లేని హీరో డిస్టిని -125 CC స్కూటీ లను పంచుల సమక్షంలో స్వాదీనం చేసుకోవటం జరిగింది. ఇట్టి దొంగిలించబడిన మొత్తం సొత్తు విలువ రూ. 13,00,000/- వరకు ఉండును ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు నిందితులను న్యాయ స్థానం ఎదుట హాజరు పరుచబడును. అదే విధంగా దొంగిలించబడిన సొత్తును భాదితులకు న్యాయస్థానంద్వారా అప్పచెప్పబడును అని తెలిపారు
ఇట్టి దొంగతనం కేసులను అతి తక్కువ వ్యవధి లో ఛేదించి నిందితులను పట్టుబడి సుమారు రూ. 13,00,000/- విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాదీనం చేసుకోవటంలో చాకచక్యత ప్రదర్శించిన కోదాడ టౌన్ CI P.ఆంజనేయులు, కోదాడ పట్టణ SI M. రామాంజనేయులు, B. ప్రవీణ్ కుమార్, సిబ్బంది యల్లారెడ్డి, సతీష్, కొండలు, రామారావు లను సూర్యాపేట జిల్లా SP S. రాజేంద్రప్రసాద్, IPS , కోదాడ DSP G. వెంకటేశ్వర్ రెడ్డి అభినందించడం జరిగినది. కేసును ఛేదించటానికి కృషి చేసిన సిబ్బంది అందరికీ రివార్డ్స్ ప్రకటిస్తున్నట్లుగా జిల్లా SP ఈ సందర్భంగా ప్రకటించి వారికి అందజేశారు