విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి

విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

జాతీయ స్థాయిలో జరిగిన ఐ,ఎన్, టి,ఎస్,ఓ పరీక్షలలో కోదాడ శ్రీ చైతన్య స్కూల్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి కాకుమాను అక్షయ్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభను కనబరిచి గ్రాండ్ ప్రైజ్ లాప్టాప్ ను సాధించాడు.అలాగే కేశవ్, షేక్ సైఫా, అలాగే షేక్ అజ్మీర్, విద్యార్థులు మొదటి బహుమతి సాధించి ట్యాబ్ లను గెలుపొందారు.ఇట్టి గెలుపొందిన బహుమతులను డీఎస్పీ కోదాడ కార్యాలయంలో డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.చిన్ననాటి నుండి వ్యాయామాలు యోగాలు క్లాసులు పాటించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిఐ ఆంజనేయులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి ,డాక్టర్ సందీప్ రెడ్డి ,శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ ఐ వెంకటేశ్వర్లు , ప్రిన్సిపాల్ గోపాలస్వామి ,శేషు బాబు ,వీరారెడ్డి, ఉపాధ్యాయులు ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking