ఆదివాసి గిరిజన గ్రామాలకి అండగా ఉంటా వారి అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తా. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

ఆదివాసి గిరిజన గ్రామాలకి అండగా ఉంటా

వారి అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తా.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

పినపాక అక్షిత ప్రతినిధి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గ్రామమైన చంద్రయ్య గుంపు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పలువురు ముఖ్య నాయకులతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లి అక్కడ స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ

మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలోని గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి జరుగుతున్నది అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తున్నదని గ్రామాల అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దానితోపాటు రహదారి సౌకర్యం కరెంటు వంటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయి తదితర అభివృద్ధి ఏర్పాట్లపై త్వరలోనే కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking