ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ముత్యాల.సుజాత రవి
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
కష్టకాలంలో ఉన్న రైతన్నకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని గ్రామ సర్పంచ్ ముత్యాల.సుజాత రవి అన్నారు.సోమవారం నాడు మండలంలోని నీర్నేముల గ్రామంలో పిఏసిఎస్ రామన్నపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు..
కేంద్ర ప్రభుత్వం మొండికేస్తున్న తెలంగాణ రైతన్న నష్టపోవద్దని, ఖర్చుకు వెనకాడకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ఘనత కే.సి.ఆర్ అని ఆమె కొని యాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపిపి నాగటి ఉపేందర్,వార్డు సభ్యులు సుర్వి సతీష్,రైతులు ఆవుల నర్సింహ,బోయిని ఆనంద్,ఆవుల శ్రీధర్,కోటమ్మ,చిప్పలపల్లి రవీందర్,సత్తయ్య,మల్లేష్,యాదగిరి,జగన్మోహన్ రెడ్డి అంజయ్య,విఠల్ రెడ్డి,లింగస్వామి,మరియు హమాలీలు అంజయ్య,రామచంద్రం,లక్ష్మీనారాయణ,సుదర్శన్,తదితరులు పాల్గొన్నారు..