నీటి పైప్లైన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్
చేర్యాల,ఏప్రిల్ 24 అక్షిత ప్రతినిధి: చేర్యాల మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డులో సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ అంకు గారి స్వరూప రాణి ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా కొరకు నీటి పైప్లైన్ పనుల ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు మంగోలి చంటి,సందుల సురేష్, తుమ్మలపల్లి లీల, పచ్చిమట్ల సతీష్ ,కో ఆప్షన్ సభ్యులు పచ్చిమట్ల అంజనీ దేవి మరియు రైతు సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి,కమిషనర్ రాజేంద్ర కుమార్, ఏఈ శ్రీకాంత్,మేనేజర్ ప్రభాకర్, మున్సిపాలిటీ సిబ్బంది,వార్డు ప్రజలు పాల్గొన్నారు.