దేశ్ కా నేత కేసిఆర్ షార్ట్ ఫిల్మ్ త్వరలో షూటింగ్ ప్రారంభం -జాతీయ రాజకీయాలలో కేసిఆర్ పాత్రపై చిత్రీకరణ -మీడియా సమావేశంలో దర్శక నిర్మాత జర్నలిస్ట్ షేక్ జానీపాషా
దేశ్ కా నేత కేసిఆర్ షార్ట్ ఫిల్మ్ త్వరలో షూటింగ్ ప్రారంభం
-జాతీయ రాజకీయాలలో కేసిఆర్ పాత్రపై చిత్రీకరణ
-మీడియా సమావేశంలో దర్శక నిర్మాత జర్నలిస్ట్ షేక్ జానీపాషా
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
దేశ్ కా నేత కేసిఆర్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఈ నెల చివరిలో ఖమ్మంలో చిత్రీకరణ నిర్వహిస్తున్నట్లు షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాత జర్నలిస్ట్ షేక్ జానీపాషా పేర్కొన్నారు.ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా జాతీయ రాజకీయాలలో ఆయన సంకల్పం తదితర పలు అంశాలపై చిత్రీకరించి ప్రజల్లోకి కేసిఆర్ పాలనను చిత్రం ద్వారా సంకేతాన్ని తీసుకెళ్తున్నానని డైరెక్టర్ జానీపాషా వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు నాటి ఉద్యమ నేత బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి వేస్తున్న అడుగులు టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేసి ధైర్య సహసాలతో జాతీయ రాజకీయాలలో కెసిఆర్ రాణించే తీరు తెన్నులు భవిష్యత్ కార్యాచరణ భారతదేశ వ్యాప్త ప్రజలకు జరగబోయే అభివృద్ధి సంక్షేమ ఫలాలు తదితర అంశాలపై జానీ క్రియేషన్స్ పతాకంపై దేశ్ కా నేత కేసిఆర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ఈనెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మంలో 20శాతం హైద్రాబాద్లో 80 శాతం షూటింగ్ ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ డాక్యుమెంటరీ చిత్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన మరో హీరోయిన్ వశిష్ఠ చౌదరి నమస్తే సేట్ జీ (ఫేమ్) హీరోయిన్ స్వప్న చౌదరి అమ్మినేని ప్రేమశక్తి ఫేమ్ హీరోయిన్ షహరీ సీనియర్ బుల్లితెర వెండితెర నటులు షేక్ లాల్ జాన్ పాషా సీనియర్ నటులు కోటయ్య శోభన్ శారధ జబర్దస్ తారాగణం తదితరులు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో నటించనున్నట్లు తెలిపారు.ఈ డాక్యుమెంటరీ చిత్రం రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ప్రజలు లబ్ధిపొందుతున్న తీరుతెన్నులు సిఎం కెసిఆర్ జాతీయ స్థాయిలో వేస్తున్న అడుగులు ఆయన అంతిమ లక్ష్యం పలు అంశాలపై ఈ డాక్యుమెంటరీ చిత్రం ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందన్నారు.ఫ్యామిలీ డ్రామాతో చిత్రీకరణ సాగుతూ తెలంగాణ నటీనటులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 90 సెకన్ల నిడివిగల ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. డాక్యుమెంటరీ పూర్తి చిత్రం 12 నుండి 15 నిమిషాలు ఉంటుందన్నారు.చిత్రీకరణ అనంతరం మంత్రి కేటీఆర్ చేత పోస్టర్ ఆవిష్కరణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేత పూర్తి చిత్రంను ఆవిష్కరించేవిధంగా సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత సీనియర్ జర్నలిస్ట్ షేక్ జానీపాషా పేర్కొన్నారు.ఈ విలేకర్ల సమావేశంలో సీనియర్ నటులు షేక్ లాల్ జాన్ పాషా శోభన్ కోటయ్య శారధ నటీనటులు పాల్గొన్నారు.