బరితెగిస్తున్న బీజేపీ -అయితగాని శ్రీనివాస్ గౌడ్ – అధికారం కోసం ఎంతకైనా తెగింపు – పెనంలో నుండి తప్పించుకుని పొయ్యిలో పడొద్దు – బుల్డోజర్లు మనకొద్దు బువ్వ పెట్టేటోడే ముద్దు – బీఎస్పీ తోనే రాజ్యాంగ పరిరక్షణ సాద్యం
బరితెగిస్తున్న బీజేపీ
-అయితగాని శ్రీనివాస్ గౌడ్
– అధికారం కోసం ఎంతకైనా తెగింపు
– పెనంలో నుండి తప్పించుకుని పొయ్యిలో పడొద్దు
– బుల్డోజర్లు మనకొద్దు బువ్వ పెట్టేటోడే ముద్దు
– బీఎస్పీ తోనే రాజ్యాంగ పరిరక్షణ సాద్యం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బరితెగింపు మొదలయిందని అధికారాన్ని దక్కించుకోవడం కోసం ఎంతటి అకృత్యాలకైనా ఆ పార్టీ సిద్దపడుతోందని బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని హిరణ్యకశిపుడి నుండి రక్షించడానికి బీఎస్పీ ప్రయత్నిస్తుంటే రావణాసురిడిలా బీజేపీ రూపంలో రాష్ట్రానికి ముప్పు పొంచుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అకృత్యాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా లేని సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో మాత్రమే బీజేపీ ఈ రాష్ట్రంలో అడుగుపెట్టగలిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రంతో రాష్ట్రంలో ప్రతిపక్షం పురుడుపోసుకుందన్నారు. మునుగోడు ఎలక్షన్లలో బీఎస్పీ అరంగేట్రంతో బీజేపీకి తిరోగమనం మొదలయిందన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా బీఎస్పీ తయారవడంతో బీజేపీకి భవిష్యత్తు అంధకారంగా మారి మతాల పేరుతో రాష్ట్రంలో కల్లోలాలు సృష్టిస్తూ ఇతర పార్టీలపై దుమ్మెత్తి పోస్తూ వికృత చేష్టలతో సైకోల వలే బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. చదువులు ఉద్యోగాలు పనులు వదిలేసి బీజేపీని గెలిపించాలన్న బండి సంజయ్ మాటలను శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అధికార దాహానికి సాధారణ ప్రజలు నలిగిపోతున్నారని ఆ పార్టీల ఖజానాలు నింపడానికి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు అండగా బీఎస్పీ ఉందని ఎవరెన్ని అరాచకాలు సృష్టించినా వాటిని తిప్పికొట్టి ప్రజలను రాక్షస పార్టీల నుండి కాపాడడానికి ప్రజలకు తాము అండగా నిలుస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని దుర్వినియోగం చేసుకొని దృతరాష్ట్ర పాలనను తెచ్చుకొని మండుటెండలో ఆందోళనలు చేసేబదులు నీడలో నీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి అని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు.