50 పడకల ఆసుపత్రి చి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు -కల్లురులో మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ ల పర్యాటన
50 పడకల ఆసుపత్రి చి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు
-కల్లురులో మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ ల పర్యాటన
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లురులో మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.తొలుత కల్లూరు మండల కేంద్రంలో రూ.10.50 కోట్లతో నిర్మింకానున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.కల్లూరులో రూ.1.93 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పర్యవేక్షక ఇంజనీర్ నీటి పారుదల శాఖ కార్యాలయ భవనాన్ని శంకుస్థాపన చేశారు.అనంతరం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన బీఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంకు హాజరయ్యారు.ఎమ్మెల్సీ తాతా మధు ఎంపీలు నామా నాగేశ్వర రావు వద్దిరాజు రవించంద్ర, బండి పార్థసారథి రెడ్డి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.