హమాలి కార్మికులకు వెల్పేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలి ఏప్రిల్ 29 న జరిగే లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయండి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కళావతి డిమాండ్

హమాలి కార్మికులకు వెల్పేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలి

ఏప్రిల్ 29 న జరిగే లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయండి
సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కళావతి డిమాండ్

మద్దూరు అక్షిత న్యూస్:
హమాలీ కార్మికులకు సంక్షేమం కోసం వెల్పేర్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు. సోమవారం రోజున జీపు జాతా కార్యక్రమం మద్దూరు, దూలిమిట్ట మండల కేంద్రాల్లోనీ అంబేత్కర్ చౌరస్తాలో జరిగింది. ఈ సందర్బంగా దాసరి కళావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా హమాలి కార్మికులకు వెల్పేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు లేకపోవడం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బస్తాలు మోస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగితే వారికి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందడం లేదని అందుకని ప్రభుత్వం వెంటనే హమాలీ కార్మికులకు ప్రమాదాలు వాటిలినప్పుడు నష్ట పరిహారం అందే విధంగా సహజ మరణం జరిగితే ఆరు లక్షలు ప్రమాదవశాస్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు గాయాల పాలైతే పని దినాలకు వేతనాన్ని లెక్క కట్టించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.పీఎఫ్ ఈఎస్ఐ గుర్తింపు కార్డులు కల్పించి అన్ని విధాల సహకారాలు అందించాలనే లక్ష్యంతో ఈ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికుడికి 6000 రూపాయలు పెన్షన్ అందించాలని.ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా హమాలి కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్,హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మామిడాలకనకయ్య,నాయకులు సంతోష్ మద్దూరు మండల హమాలి యూనియన్ అధ్యక్షులుఅల్ల రమేష్,కార్మికులుచిలుక పరుశురాముల, మోత్కూరి బాబు, పిట్టల నరేష్, ఇష్టమైన ప్రభాకర్, బోయిని నర్సింలు, పుల్లూరి సురేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking