టిడిపిలో చేరిన పాల్వంచ రామరావు

టిడిపిలో చేరిన పాల్వంచ రామరావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం పార్లమెంటు అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పాల్వంచ రామారావు తెలుగుదేశం పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో 50 కుటుంబాలతో జ్ఞానేశ్వర్ ఇంటి వద్ద పార్టీలో చేరారు.వారిని సాదరంగా స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కనగాల సాంబశివరావు ఖమ్మం నగర కోఆర్డినేటర్ వడ్డెం విజయ్ పాల్గోన్నారు.అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి పార్టీ సత్తా చూపించాలని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని త్వరలో ఖమ్మంలో చేపట్టబోయే మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ నాయకులను కోరారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బివి రాఘవులు ఖమ్మం జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి టీవీ రాజు బీసీ జేఏసీ వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుండి చల్ల రామకృష్ణ ఏ నాగేంద్ర చారి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటేశ్వర్లు పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking