గ్రీన్ పార్క్ కాలనీ వాసుల ఎఫ్ టి ఎల్ సమస్యలపై రీసెర్వే చేయాలని సూచన. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.

గ్రీన్ పార్క్ కాలనీ వాసుల ఎఫ్ టి ఎల్ సమస్యలపై రీసెర్వే చేయాలని సూచన.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ,గ్రీన్ పార్క్ కాలనీ వాసులతో అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులచే కలిసి గ్రీన్ పార్క్ కాలనీ నందు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.ఇట్టి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆర్.డి.ఓ. సూరజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ పార్క్ కాలనీ సమస్యల గురించి గతంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయిన అమోయ్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ ప్రతిక్ జైన్ కలిసి గ్రీన్ పార్క్ కాలనీ వాసుల ఎఫ్.టీ.ఎల్ వివాదంపై సమస్యల మీద విన్నపించడం జరిగింది.అయితే వారు జాయింట్ కలెక్టర్ పరిశీలించాలని తెలిపారు.ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయిన హరీష్ కూడా కలవడం జరిగింది.దానిలో భాగంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 2008 లో గ్రీన్ పార్క్ కాలనీ చెరువు మీద వాటర్ బెల్ట్ అని ఒక జీ.ఓ.తీసుకురావడం జరిగింది అని తెలిపారు.

ఇట్టి జీ.ఓ.తీసుకురావడం వల్ల ఎఫ్.టీ.ఎల్ పరిధి బఫర్ జోన్ పరిధిలో ఉన్నవి మరియు బఫర్ జోన్ బయట ఉన్న వాటికి అనుమతులు రావడం లేదు. కలెక్టర్ చేసిన సూచనల మేరకు ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసి ఈ వాటర్ బెల్ట్ జీ.ఓ.ను ఉపసంహరణ చేసుకొనే విధంగా ప్రయత్నం మొదలుపెట్టబోతున్నాము అని తెలిపారు. గతంలో అనగా 2014 వ సంవత్సరం నందు ఆర్.వి.సొల్యూషన్ వారు జీ.హెచ్.ఏం.సీ. వారు ఎఫ్.టీ.ఎల్.సర్వే చేయడం కోసం రావడం జరిగింది. అయితే వారితో కాలనీవాసులు వాగ్వాదం చేయడం జరిగింది. ఆర్.వి. సొల్యూషన్ వారు కాలనీ మొత్తం ఎఫ్.టీ.ఎల్. లోకి చేర్చడం జరిగింది. దీనివల్ల దాదాపు 800 కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం జరుగుతుంది అని తెలిపారు.కావున రిసర్వే చేసి కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరారు. గ్రీన్ పార్క్ కాలనీ వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రెండు రోజుల్లో రిసర్వే చేయడం జరుగుతుందని అన్నారు .ఇట్టి కార్యక్రమంలో ఇరిగేషన్, హెచ్.ఏం.డి.ఏ, అధికారులు, జీ.హెచ్.ఏం.సీ. లేక్
అధికారులు, రెవెన్యూ అధికారులు, నాయకులు, గ్రీన్ పార్క్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కమలేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి, నర్సిరెడ్డి, నారాయణ రెడ్డి, జగన్ రెడ్డి, డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, తిలక్ రావు మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking