న్యాయ సేవలు కలకాలం గుర్తుంటాయి
* గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
ప్రజలకు సత్వరమే అందించిన న్యాయ సేవలు వారి మదిలో కలకాలం గుర్తుండి పోతాయని మలిదశ తెలంగాణ ఉద్యమ నేత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ మహబూబాబాద్ కు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆయనను సోమవారం దిండిగాల మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి మొక్కను బహుకరించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయాన్ని బ్రతికించేందుకు న్యాయమూర్తులు అందించే సేవలు చిరస్మరణీయమని వందమంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు గాని ఒక నిర్దోషి కి దోషిగా శిక్ష పడకూడదనే భావనతో న్యాయ సేవలను కొనసాగించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో సైతం చక్కటి న్యాయ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి కిషన్, జయరాం తదితరులు ఉన్నారు.