వడగండ్ల వాన వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరీశిలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్..

వడగండ్ల వాన వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరీశిలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్..

సిద్దిపేట అక్షిత ప్రతినిధి :

సోమవారం కొమురవెల్లి మం డలం ఐనాపూర్, పోసాన్ పల్లి గ్రామం మరియు చేర్యాల మండలంలోని పెద్దరాజ్ పేట, పోతిరెడ్డిపేట గ్రామాలలో వడ గండ్ల వాన వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న వరి పంటలను క్షేత్ర స్థా యిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ….రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు జిల్లా మంత్రి హరిష్ రావు ఆదేశాల మేరకు గతా రెం డు రోజులు జిల్లాలో ముఖ్యం గా కొమురవెల్లి చేర్యాల మండ లాల్లో వడగండ్ల వాన వల్ల వరి పంటలకు తీవ్రంగా నష్టం జరి గింది.యుద్ధ ప్రాతిపదికన నష్ట పోయిన వరి పంటల వివరా లను సేకరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.అదే పద్దతిలో వ్యవసాయశాఖ తరపున ఎడి ఎ, ఎఈఓ, ఇతర అధికారుల ఆద్వర్యంలో ఈ రెండు మండ లాల్లో 12నుండి 15గ్రామాల్లో వరి పంటనష్ట వివరాలను పార దర్శపద్దతిలో సేకరిస్తారు.దెబ్బ తిన్న వరి పంట వివరాలను విస్తీర్ణం, సర్వే నెంబర్ వారిగా రెండు రోజులు గ్రామపంచా యతీలలో అతికిస్తారు.ఎ రైతులకు ఎంత నష్టం జరిగిందో ప్రతి ఓక్కరు చుస్తారు.నష్టపో యిన అర్హత ఉన్న రైతు వివరా లను సేకరించి ఎలాంటి అభ్యం తరాలు లేకపోతే అర్హత లేని రైతులను లిస్ట్ నుండి తోలగిం చుతారు.

వ్యవసాయ శాఖతో పాటు మామిడి ఇతర పండ్ల తోట సంబందించి ఉద్యాన వన శాఖ, ఐనాపుర్ గ్రామంలోనే సుమారుగా 10 నుండి 15వ వరకు ట్రాన్స్ ఫార్మర్ లు పాడై నాయు కావున విద్యుత్ శాఖ ఎస్సీ,ఎడి ఈరోజు, రేపు వచ్చి వివరాలను సేకరించాలని ఆదే శించారు. నష్టపోయిన కౌలు రైతులకు సంబందించి ప్రభు త్వం తప్పనిసరిగా మంచి నిర్ణయం తిసుకుంటుంది.రైతు వారిగా ధరణి పోర్టల్ ఉన్న నం బర్ ల ఆధారంగా పై అధికారు లకు పంట నష్ట వివరాలను అందించడం జరుగుతుంది. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపుగా 2000 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది కాని ఈ రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బ తిన్న వరి పంట వివరాల లో స్పష్టత వస్తుంది. ప్రభుత్వం ఎ ఓక్క రైతుకు కుడా అన్యా యం జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చా రు.కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఎడిఏ, స్థానిక ఎఈఓలు, తహసిల్దార్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking