ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా ◆ ముస్లింల అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యం ◆ రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు దొంగనోట్లు, రేపిస్ట్ చక్రధర్ గౌడ్ కు లేదు ◆ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా
◆ ముస్లింల అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యం
◆ రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు దొంగనోట్లు, రేపిస్ట్ చక్రధర్ గౌడ్ కు లేదు
◆ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా మన్న బిజెపిని ముస్లింలందరూ కలిసి ఆ పార్టీని రద్దు చేయాల ని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అ న్నారు.సిద్దిపేటలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం కలనేనని, బిజెపి నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దే వా చేశారు. డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ రాసిన భారత రాజ్యాం గాన్ని, ముస్లింల హక్కులను బిజెపి తుంగలో తొక్కుతుందని విమర్శించారు.ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లింలు ఈ దేశ పౌ రులు కాదా అని మండిప డ్డారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి రాష్ట్రంలో 20 సీట్లు కూడా గెలవని పరిస్థితి నెలకొందని అన్నారు. అబద్ధపు మాటలు, అసత్య ఆరోపణలు చేస్తూ బిజెపి పబ్బం గడుపుకుంటుం దని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగులను మోసం చేస్తూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని అన్నారు.అలాంటి దొంగల చేతిలో రాష్ట్రం పెడితే మొత్తం అమ్ముకుంటారని ఆరో పించారు. ముస్లింల అభివృద్ధి రిజర్వేషన్ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రా ష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిన్న మొన్న పార్టీలో చేరిన వారు రేవంత్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దొంగ నోట్లు రేపిస్ట్ అయిన చక్రధర్ గౌడ్ రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి అతని కి ఉందా అని ప్రశ్నించారు. దొంగ నోట్ల కేసులో రేపిస్టుగా జైలుకు వెళ్లి వచ్చిన చక్రధర్ గౌడ్ కు ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు.మరోసారి రేవంత్ రెడ్డి ను కాంగ్రెస్ ను విమర్శిస్తే చక్రధర్ గౌడ్ కు తగిన బుద్ధి చెప్తామని ఘాటుగా హె చ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దిపేట్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు మజార్ మాలి క్ గాయసుద్దీన్ ఫయాజ్ అ య్యబ్ కరీం తదితరులు పాల్గొ న్నారు.