*కాచారంలో ఈదురు గాలి బీభత్సం
ధ్వంసంమైన ఇండ్లు ,గాల్లోకి లేచిన రేకులు
గుర్రంపోడు, అక్షిత ప్రతినిధి : అనుకోకుండా అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలి గుర్రంపోడు మండలం కాచారం గ్రామంలో బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలి కారణంగా గ్రామంలోని మహమ్మద్ సైదాబీకి చెందిన ఇంటి పైకప్పు సిమెంటు రేకులు ధ్వంసం అయి గాల్లోకి లేచాయి.

ఆ సమయంలో ఎవ్వరు లేకుండా అందరూ పనులకు వెళ్లడంతో ఎవ్వరికీ ఏమి కాలేదు. ఈదురు గాలుల కారణంగా రెండు గదుల ఇంటి పైకప్పు రేకులు ధ్వంసం కావడంతో సుమారు 40 వేల రూపాయల అస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నష్టపరిహారం అందజేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరింది.