దివ్యాంగుల పెన్షన్ పెంపునకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సీఎం కేసీఆర్ దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సంక్షేమానికి దివ్యాంగుల పెన్షన్ రూ.3,016 నుండి రూ.4,116 లకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దివ్యాంగులు ఆదివారం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

పేదరికంలో ఉన్న దివ్యాంగుడు లక్ష్మీనారాయణకు ఐదువేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని దివ్యాంగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల సైదులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్ధార్థ అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ డైమండ్ మాశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అడవిదేవులపల్లి ఎంపీపీ బాలాజీనాయక్, దివ్యాంగుల సమాఖ్య అధ్యక్షులు సింగు రాంబాబు, కార్యదర్శి రేగటి వెంకటేశ్వర్లు, కోశాధికారి బిట్టు చిరంజీవి ,పిడబ్ల్యూడిఓ జానీ, వికలాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మగ్డూమ్ పాషా, ఎంఈఓ బాలాజీ నాయక్, బిఆర్ఎస్ నాయకులు వింజం శ్రీధర్, ఏచూరి మురారి, ఏచూరి భాగ్యలక్ష్మి, బిఎం నాయుడు, ఎనగండ్ల లింగయ్య, వికలాంగుల సంఘం నాయకులు ఆఫన్ అలీ పాల్గొన్నారు.