సజావుగా సాగిన గ్రూప్ 1 పరీక్ష

*జిల్లాలో సజావుగా సాగిన గ్రూప్ 1 పరీక్ష*

*జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్*

*మంచిర్యాల, అక్షిత బ్యూరో :

జిల్లాలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గ్రూప్ 1 పరీక్ష సందర్భంగా జిల్లాలోని బెల్లంపల్లి లో గల సెయింట్ మేరీస్, పాలిటెక్నిక్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 పరీక్ష నిబంధనల మేరకు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను బయట ఉంచి పరీక్ష కేంద్రంలోనికి వెళ్లి పరీక్ష నిర్వహణ తీరు, సిసి కెమెరా రూమ్ లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 9 వేల 243 మంది అభ్యర్థులు పరీక్ష రాయవలసి ఉండగా, 65.74 శాతంతో 6 వేల 76 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థుల కొరకు సహాయకులను ఏర్పాటు చేసి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking