*బీసీలను మోసం చేసేందుకే రూ.లక్ష రుణాలు
మాజీ సర్పంచ్ నాగవెళ్లి మధు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : గత 9 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రములోని బీసీలను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఎన్నికల్లో బిసిల ఓట్లు దండుకొని గద్దెనెక్కి మరోసారి మోసం చేయడానికే బిసి కులవృత్తులకు 1 లక్షరూపాయలు ఇస్తున్నట్లు వేములపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగవెళ్లి మధు ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి అందులో నుంచి ఒక్కపైసాయిన ఖర్చుచేయకపోవడం బీసీలపై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.బిసిలకురూ.లక్ష రుణాలు అందించడం కేవలం ఎన్నిక కోసమేనని బిసిలకు మరోసారి మోసాగించమే అనిమండిపడ్డారు.సబ్బండ వర్గాలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం,అధికార యంత్రాంగం దశాబ్ది ఉత్సావాల పేరిట జిల్లాకు కోటిరూపాయలు కేటాయించి దావాతులు చేస్తూ ప్రజలనుమభ్యబెట్టే ప్రయత్నంచేస్తుందన్నారు. దళితబంధుతో దళితులను, గొర్రెల పంపిణితో గొల్ల కురుమలను, మత్స్యకారులను మోసం చేసి కులవృత్తులకు లక్ష రుణం పేరుతో మోసం చేస్తున్న కేసీఆర్ నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో కర్రు కాల్చివాత పెట్టి తగినగుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం అందించే లక్షరూపాయల రుణం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.