*ప్రపంచ జ్ఞానమూర్తి డా. బి ఆర్ అంబేద్కర్ *మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
ప్రపంచ జ్ఞానమూర్తి ఆధునిక భారత నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం అంబేద్కర్ నగర్ లో ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర రావు ఆవిష్కరించారు.ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అ మహానీయుని ఘనకీర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల భారీవిగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే నేడు ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విగ్రహనిర్మాణ కమిటీ శెట్టిపాలెం మాలసంఘం, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎలిజాల రమేష్ ఉపాధ్యక్షులు డాక్టర్ ఈసం జానకి రాములు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కందుల శివకృష్ణ, కార్యదర్శి శ్రీ భోగారి శ్రీరాములు తదితరులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కోడిరెక్క ఫకీరయ్య, కోడిరెక్క మట్టయ్య, బొల్లేద్దు వెంకన్న, కోడిరెక్క శంభులింగం, కోడిరెక్క వెంకటయ్యలతోపాటు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ యువజన విద్యార్ద సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడిరెక్క నాగేందర్ కోలాట బృందం చేసిన ప్రదర్శన అలరించింది.