సిపిఐ ప్రజాగర్జనకు తరలి వెళ్లిన మిర్యాలగూడ సిపిఐ శ్రేణులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున సిపిఐ పార్టీ ప్రజా గర్జన బహిరంగ సభకు ఆదివారం మిర్యాలగూడ నుండి బయలుదేరిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలు రాజ్యాంగ లౌకిక వ్యవస్థ పరిరక్షణకై కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియంలో జరుగు బహిరంగ సభ నిర్ణయం తీసుకుని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ ఆర్థిక స్థితిగతుల మీద దేశాన్ని నడిపించకుండా మతాల పేరిట, దేవుళ్ళ పేరిట దేశాన్ని నడిపించాలని కుటిల ప్రయత్నంతో కొనసాగుతున్నారు. ఇవాళ దేశంలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యను పట్టించుకోకుండా కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వే, టెలికం, విమాన సంస్థలు నౌకాశ్రయాలు, ఆయిల్ కంపెనీలు, రక్షణ పరిశోధన రంగాలు ప్రైవేటీకరణ చేయకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి కార్మికులు వారు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యధావిధిగా ఉంచాలని, 8గంటల పని విధానాన్ని అమలు పరచాలి యువకులకు నిరుద్యోగ భృతి కింద రూ.3,016లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల వాటా తేల్చాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలో పెండింగు ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారన్నారు. బహిరంగ సభకు నాయకులు వేములపల్లి మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, మిర్యాలగూడ మండల సహాయ కార్యదర్శి గువ్వల అంజయ్య, గోగుల యాదగిరి, వలపట్ల వెంకన్న, గువ్వలవెంకటయ్య, ఎస్ కే షమీం, లింగంపల్లి సైదమ్మ, బంటు రేణుక, చింతమల రాములు, బంటు దేవి, వరప్రసాద్, గూగుల్ యశ్వంత్, లింగం తరలి వెళ్లారు.